జూన్ 2 న విడుదల కానున్న 'ఫ్యాషన్ డిజైనర్'
- May 06, 2017
ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి మేటి దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం 'లేడీస్ టైలర్' అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన సంగతి తెల్సిందే..రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు.. ఆ పాత మధురం 'లేడీస్ టైలర్' సినిమాకి సీక్వెల్ 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇటీవలే రిలీజైన ఈ చిత్రం యొక్క పోస్టర్లకు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమాను జూన్ 2వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే ఈ తేదీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







