చైనా లో కూడా సత్తా చూపించిన అమిర్ ఖాన్ దంగల్
- May 06, 2017
చైనాలో భారతీయ సినిమాలను ఆదరించే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది అక్కడ. అమీర్ నటించిన పీకే సినిమా కేవలం చైనా బాక్సాఫీసులోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది. చైనాలోని అతిపెద్ద సినిమా ఆపరేటర్ వాండా ఈ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించినా.. 7 వేల స్క్రీన్లలో దంగల్ సినిమా రిలీజైంది. విడుదలైన తొలిరోజే 15 కోట్లు వసూలు చేసింది. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల డామినేషన్ కనిపించే చైనా మార్కెట్లో బాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటాయని అమీర్ ఇప్పటికే నిరూపించాడు.
ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ సినిమాలను చైనాలో నేరుగా విడుదల చేయడానికి వీల్లేదు. పీకే సినిమాకు మంచి వసూళ్లు వచ్చినప్పటినుంచి చైనా మార్కెట్లో మన సినిమాలు విడుదల చేయడానికి భారతీయ నిర్మాతలు మంచి ఉత్సాహం చూపిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







