తెలంగాణ హైదరాబాద్, ఉత్తరాంధ్రలో జనసేన ఎంపికలు
- May 06, 2017
జనసేన తరఫున క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనేవారిని గుర్తించడానికి ఆ పార్టీ ఇప్పటికే ఎంపిక ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్రలో తదుపరి ఎంపికలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
రాజకీయ ప్రక్రియలో నవతరం, మేధావులకు చోటు కల్పించాలన్న జనసేన సంకల్పంలో భాగంగా తలపెట్టిన ఎంపిక ప్రక్రియను ఈ సారి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపికలను జయప్రదం చేసినందుకు ఆ జిల్లా వాసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన తరఫున క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనే వారిని గుర్తించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఎంపిక ప్రక్రియను పోటీ పరీక్షగా భావించరాదని, ఇది ప్రతిభ, శక్తియుక్తులను గుర్తించడానికి మాత్రమేనని తెలియజేశారు. స్పీకర్(వక్త), అనలిస్ట్/కంటెంట్ రైటర్ విభాగాలకు ఔత్సాహికులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలని కోరుతూ చిరునామా(యుఆర్‌ఎల్)ను అందించారు. 06-05-17 నుంచి 13-05-17 రాత్రి 8గంటల వరకు దరఖాస్తులు పంపవచ్చని తెలిపారు. ఈ రాజకీయర యజ్ఞంలో పొల్గొనదలచిన జన సైనికులకు, అభిమానులకు, యువతీయువకులకు, మేధావులకు ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ హైదరాబాద్: http://janasenaparty.org/greaterhyderabad/
విశాఖ జిల్లా: http://janasenaparty.org/visakhadistrict/
విజయనగరం జిల్లా: http://janasenaparty.org/vijayanagaramdistrict/
శ్రీకాకుళం జిల్లా: http://janasenaparty.org/srikakulamdistrict/
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







