దొంగతనం కేసు నుంచి నర్స్‌కి ఊరట
- May 06, 2017
యు.ఏ.ఈ:26 ఏళ్ళ సుడానీస్ నర్స్, దొంగతనం కేసు నుంచి ఉపశమనం పొందింది. 81 ఏళ్ళ ఎమిరేటీ స్పాన్సరర్ దగ్గర ఆమె పనికి కుదిరింది. ట్రీట్మెంట్ నిమిత్తం ఆమెను, యజమాని దగ్గర ఉంచారు. తొలుత ఆమె ఈ పనికి అంగీకరించనప్పటికీ, తర్వాత ఒప్పుకుందని 81 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి తనయుడు 33 ఏళ్ళ సైనికుడు చెప్పారు. 2016 జూన్‌లో ఆమెను పనికి కుదిర్చినట్లు విచారణలో న్యాయస్థానానికి తెలిపారు వృద్ధుడి తనయుడు. ట్రీట్మెంట్ నిమిత్తం తన తండ్రి విదేశాలకు వెళుతుండగా, నర్స్‌ని తాత్కాలికంగా సెలవు తీసుకోమని కోరినట్లు వెల్లడించిన తనయుడు, ఆ సమయంలో ఆమె బ్యాగ్‌లో తమకు కొన్ని వస్తువులు దొరికాయని, ఆ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే న్యాయస్థానంలో 81 ఏళ్ళ వృద్ధుడు, తన కోసం పనిచేసిన నర్స్ తన వద్దనుంచి ఏమీ దొంగిలించిందని తాను విశ్వసించడంలేదని చెప్పడంతో ఈ కేసులో నర్సుకి ఊరట లభించింది. తన వద్ద ఉన్నన్నాళ్ళూ వినియోగించుకోవాల్సిందిగా వాచ్నీ, ల్యాప్టాప్నీ తానే ఇచ్చినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







