మెగాస్టార్ ఉయ్యాలవాడ ఊగిసలాట
- May 06, 2017
మెగాస్టార్ చిరంజీవి 151 మూవీగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చేసే పనిలో పడ్డారు. అయితే ఉయ్యాలవాడ జీవితానికి వీరపాండ్య కట్టబొమ్మన జీవితానికి చాలా పోలికలు వున్నాయట. ముఖ్యంగా వీరపాండ్య కట్టబొమ్మనలాగే ఉయ్యాలవాడ కూడా తన అనుచరుడి నమ్మకద్రోహం వల్లే బ్రిటిష్ వారికి చిక్కి చంపబడ్డాడట. దాంతో ఉయ్యాలవాడపై వీరపాండ్య వాసనలు రాకుండా పరుచూరి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారట.
ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయంలో కూడా ఊగిసలాటలో వుంది యూనిట్. చిరంజీవితో ఐశ్వర్య రాయ్ ఆల్మోస్ట్ ఫైనల్ అనే న్యూస్ ఇప్పటికే వచ్చింది. అయితే డైరెక్టర్ సురేంద్ర రెడ్డి మాత్రం ఐశ్వర్య రాయ్..విద్యాబాలన్ ఇద్దరితో ఉయ్యాలవాడ కోసం మీట్ అయ్యాడట. ఈ ఇద్దరిలో ఎవర్ని ఫైనల్ చేయాలనే విషయంలో ఇంకా సురేంద్ర రెడ్డి క్లారిటీగా లేడనేది ఇన్ సైడ్ న్యూస్. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని చిరు బర్త్ డే ఆగస్ట్ 22న స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో వున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







