టాలీవుడ్ సినీ దర్శకుడి ఇంట్లో యువతి ఆత్మహత్య
- May 07, 2017
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఇంట్లో పనిచేసే ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతురాలు తూర్పుగోదావరి జిల్లా కట్టమూరుకు చెందిన జయ. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. దర్శకుడు కోదండరామిరెడ్డి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.70లో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో జయ అనే యువతి కొంత కాలం నుంచి పనిచేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
అనుమానాస్పద మృతిగా భావించి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జయతో పాటు ఆమె తల్లి నాగమణి కూడా పనిచేస్తుంది. అయితే కొంతకాలం కిందట స్వగ్రామం కట్టమూరుకు వెళ్లిన జయ తనతోపాటు తల్లి నాగణిని నగరానికి తీసుకొచ్చింది. తన తల్లితో పనిచేయించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని కొందరు, తల్లితో తన బాధలు చెప్పుకోలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిందని మరికొందరు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







