అభిమానులకు బాహుబలి హీరో ప్రభాస్ ధన్యవాదాలు
- May 07, 2017
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సునామీ సృష్టిస్తోంది.. విడుదలైన 10 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది.. ఒక్క భారత్‌లోనే ఏడు వందల 50 కోట్లను సునాయాసంగా రాబట్టింది. ఇక విదేశాల్లో మరో రూ.250 కోట్లు రాబట్టింది.. దీంతో బాహుబలి2 భారత్‌సినీ చరిల్రో వెయ్యి కోట్లు సాధించిన సరికొత్త రికార్డు సృష్టిచింది..
ఈ సందర్భంగా చ్తిరం యూనిట్ రూ.1000 కోట్లుసాధించినట్టుకొత్త పోస్టర్ విడుదల చేసింది.. బాహుబలి హీరో ప్రభాస్ తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.. 'నా ఫ్యాన్స్ అందరికీ నాపై మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు భారత్‌లోనే కాకుండా విదేశాల్లోని ప్రేక్షకుల ఆదరణ పొందటానికి నా ప్రయత్నం నేనుచేశాను. మీ ఆదరణ చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. బాహుబలి చిత్రం ఓ సుదీర్ఘ ప్రయాణమే అయినా సినిమా నుంచి నేను ఆశించే వాటిలో మీరంతా కూడ ఉన్నారు.. నాపై నమ్మంతో జీవితంలో ఒక్కసారి లభించే ఇలాంటి అవకాశం ఇచ్చి ఈ ప్రయాణాన్ని జీవితాతం గుర్తుండిపోయేలా చేసిన రాజమౌళికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా.. అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







