బాహుబలి-2పై స్పందించిన పవర్ స్టార్
- May 07, 2017
భారతీయ సినీ చరిత్రలో ఆల్‌టైమ్ హిట్‌గా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసిన బాహుబలి-2పై ప్రపంచమంతా ప్రశంసలు కురిపిస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడని సినీ స్టార్లుగానీ, రాజకీయనేతలుగానీ లేరు!
ఈ క్రమంలోనే జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కూడా బాహుబలి-2పై తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు పవర్ స్టార్ ఆదివారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు.
రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ సహా బాహుబలి టీమ్ అందరికీ పవన్ అభినందనలు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఐదేళ్లపాటు కష్టపడిన రాజమౌళి మనందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేశారు..’ అన్న పవన్ కల్యాణ్.. భవిష్యత్తులో ఆయన(రాజమౌళి) మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి.. పవన్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు







