కామిడీ షో జబర్దస్త్ యాక్టర్ వినోద్ సూసైడ్ అటెంప్ట్ కలకలం
- May 08, 2017
కామిడీ షో జబర్దస్త్ యాక్టర్ వినోద్ సూసైడ్ అటెంప్ట్ కలకలం సృష్టించింది. బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ చేతిని కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు వినోద్. కడప జిల్లా సంజామల మండలం బొందలదిన్నెలో జరిగిందీ ఘటన.
జబర్దస్త్ లేడీ గెటప్ లో వినోద్ ఫుల్ ఫేమస్. మనోడు లేడీస్ కాదు జెంట్ అని చెబితేనే కానీ తెలీనంతగా జీవించేస్తాడు లేడీ కేరెక్టర్ లో. అచ్చం అమ్మాయిలానే కనిపిస్తూ.. అలానే నటిస్తూ.. అలానే మాట్లాడుతూ ఫుల్ క్రేజ్ సంపాదించాడు. అమ్మాయిలకే అసూయ పుట్టించేటంత అందం అతని సొంతం. అతని చీర కట్టు.. బొట్టు.. కొప్పు.. చూస్తే.. ఎక్కడా అబ్బాయి అనిపించదు. అతను ఏ స్కిట్ వేసినా గోలగోలే. జబర్దస్త్ లో స్థిరపడిపోయిన వినోద్ కు పెళ్లి చేయాలని వాళ్లింట్లో నిర్ణయించారు. అయితే.. తనకు పెళ్లి వద్దంటూ వినోద్ నిరాకరిస్తూ వస్తున్నాడు. వినోద్ వాళ్ల అమ్మ కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేయగా.. సూసైడ్ అటెంప్ట్ చేశాడు వినోద్. పోలీసులకు విషయం తెలియడంతో బలవంతపు పెళ్లిని నిలిపేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







