ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొన్న బాలయ్య !
- May 09, 2017
నందమూరి బాలకృష్ణ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. పూరి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే బాలయ్య అర్జెంట్ గా ఈ లైసెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11నుంచి పోర్చుగల్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. దాదాపు 40 రోజుల పాటు పోర్చుగల్ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ చిత్రంలో బాలయ్య టాక్సీ డ్రైవర్ గా కమ్ గ్యాంగ్ స్టర్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. పోర్చుగల్ లో షెడ్యూల్ లో ఛేజింగ్ సీన్స్ కూడా ఉన్నాయట. ఇందుకోసం బాలయ్యకి అర్జెంటుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమైంది.
'సమరసింహా రెడ్డి' సినిమాలో బాలయ్య బాలయ్య టాక్సీ డ్రైవర్ కమ్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించాడు. ఇప్పుడు పూరి సినిమా కోసం టాక్సీ డ్రైవర్ కమ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఆటో డ్రైవర్ సెంటిమెంట్ వర్కవుట్ అయినట్టే.. బాలయ్యకి టాక్సీ డ్రైవర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
ఈ చిత్రంలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ జతకట్టనున్నారు. ఇప్పటికే శ్రియ, మస్కాన్ లని చిత్రబృందం ఫైనల్ చేసింది. మరో హీరోయిన్ ఇంకా ఫైనల్ చేయలేదు. బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







