సౌదీలో అబ్బాయి..యూపీలో అమ్మాయి..పెళ్లి వీడియో కాన్ఫరెన్స్‌లో!
- May 09, 2017
టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించేసింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మొబైల్ చేతిలో ఉంటే చాలు.. ఎదురెదురుగా ఉన్నట్లే మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడిదే తంతు పెళ్లిళ్ల విషయంలోను కొనసాగుతోంది. అబ్బాయి ఒకచోట.. అమ్మాయి మరోచోట ఉన్నా సరే.. పెళ్లి తంతు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానిచ్చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని షామ్లి జిల్లాలో చోటు చేసుకుంది. అబ్బాయి సౌదీలో.. అమ్మాయి షామ్లి ప్రాంతంలో ఉండగా.. పెళ్లి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపించారు. పలు అనివార్య కారణాలతో వరుడు సౌదీలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది.
దీంతో ముందుగా నిర్ణయించిన రోజునే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి జరిపించారు.
వధువు తండ్రి రెహాన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. సోమవారం నాడు ఇరువురి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిపించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







