అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్
- May 09, 2017
జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లో బిగెస్ట్ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ రావటంతో ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
చిత్రయూనిట్ ఆ అంచనాలు మరింత పెంచే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను రూపొందిస్తున్నారట. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు మోషన్ పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు గెటప్లను మిక్స్ చేసి డిఫరెంట్గా ఫస్ట్ లుక్ పోస్టర్ను డిజైన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







