అమెరికాలో మరో దారుణం: 'సిగరేట్' కోసం భారతీయుడి హత్య
- May 09, 2017
అమెరికాలో జరుగుతున్న వరుస భారతీయుల హత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో భారతీయుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన జగ్ జీత్ సింగ్ (32) 18 నెలల క్రితం అమెరికా వచ్చారు.
ఆయన హట్చ్ ఫుడ్, గ్యాస్ కన్వీనియెన్స్ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఆయనను ఒక వ్యక్తి వచ్చి సిగిరెట్లు కావాలని అడగడంతో.. మైనర్ ఏమో అని అనుమానం వచ్చిన జగ్ జీత్ సింగ్ ఐడీ చూపించాలని కోరాడు. కాగా, విధులు పూర్తి చేసి, బయటకు వచ్చిన జగ్ జీత్ సింగ్‌ను ఆ వ్యక్తి జాత్యహంకారంతో దూషిస్తూ, కత్తితో పొడిచేశాడు.
గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 9 గంటలపాటు చికిత్స పొందిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా, వారం వ్యవధిలోనే వరుసగా భారతీయులు హత్యకు గురికావడం పట్ల ఆందోళన నెలకొంటోంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







