ఏడుగురు భార్యలతో సంచలనం సృట్టిస్తున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు
- May 09, 2017
'హృదయ కాలేయం' సినిమాతో బర్నింగ్ స్టార్ గా మారిన సంపూర్ణేష్ బాబు మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. ఈరోజు అతడి పుట్టినరోజు. ఈ బర్నింగ్ స్టార్ నటించిన సినిమాలు అతి తక్కువే అయినా అందరి హీరోల అభిమానులు సంపూని అభిమానించడం అతడి అదృష్టం అనుకోవాలి. ఈ డాషింగ్ హీరో నటిస్తున్న 'కొబ్బరి మట్ట' సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ను ఈరోజు సంపూ బాబు బయట పెట్టాడు.
ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంపూ ఈ విషయాలను షేర్ చేసాడు. 'కొబ్బరి మట్ట' మూవీ ఏడాదిన్నర కిందట మొదలైనా ఈసినిమాకు రకరకాల కష్టాలు వస్తూ ఉండటంతో ఈసినిమా విడుదల చాల ఆలస్యం అవుతోంది. ఈసినిమాకు సంబంధించి ఒక లెంగ్తీ డైలాగ్ తో టీజర్ వదిలి కూడా దాదాపు పది నెలలు కావస్తోంది.
అయినా ఇప్పటిదాకా సినిమా విడుదల కాలేదు. దీనితో కొన్ని నెలల పాటు అసలు వార్తల్లోనే లేకుండా పోయిన ఈ సినిమా ఈమధ్య సంపూ ఫన్నీ డ్యాన్స్ వీడియోతో మళ్లీ జనాల్లో హాట్ న్యూస్ గా మారింది. ఇప్పుడు ప్రమోషన్ జోరు కొంచెం పెంచి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు.
'కొబ్బరిమట్ట' లో సంపూ పోషించిన పాపారాయుడి పాత్రకు ఏకంగా ఏడుగురు భార్యలుంటారట. వాళ్లకు పది పన్నెండు మంది పిల్లలుంటారట. ఆపది పన్నెండు మందికి ఇంకో 30-40 మంది దాకా పిల్లలుంటారట. ఇలా మొత్తంగా ఓ పెద్ద కుటుంబానికి పెద్దలా తాను ఉంటాను అని చెపుతున్నాడు సంపూ.
ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న ఈసినిమాలో ఎక్కువగా స్పూఫులు ఉండవని కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుందని అంటున్నాడు సంపూ. ఈసినిమాలో డైలాగులు అదిరిపోతాయని చెపుతూ ఈసినిమాను జూన్ లో విడుదల చేయబోతున్నట్లు సంపూ లీకులు ఇస్తూ ఉండటంతో ఈ సమ్మర్ రేస్ లో సంపూ బాబు కూడ చేరిపోయాడనుకోవాలి..
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







