అరబ్ హోప్ మేకర్స్‌ని సన్మానించనున్న షేక్ మొహమ్మద్
- May 10, 2017
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ రషీద్ అల్ మక్తౌమ్, మే 18న అరబ్ హోప్ మేకర్స్ ఇనీషియేటివ్ విన్నర్‌ని సన్మానించనున్నారు. అరబ్ ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేపట్టే ప్రముఖులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అరబ్ హోప్ మేకర్స్ ఇనీషియేటివ్‌ని ప్రారంభించారు. వారిని గౌరవించడం ద్వారా, సమాజంలో అలాంటివారు మరికొందరు ముందుకొచ్చేదిశగా, వారిలో ఉత్సాహాన్ని నింపవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు. 22 దేశాల నుంచి మొత్తం 65,000 అప్లికేషన్స్ అరబ్ హోప్ మేకర్స్ ఇనీషియేటివ్ అందుకుంది. గ్రేటెస్ట్ హోప్ మేకర్ గౌరవం దక్కించుకునే వ్యక్తికి 1 మిలియన్ దిర్హామ్ బహుమతిగా అందుతుంది. ఈ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం కల్పిస్తారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ఇనీషియేటివ్ ఇప్పటికే 65,489 అప్లికేషన్లను దక్కించుకుంది. 22 అరబ్ దేశాల నుంచి నామినేషన్లు స్వీకరించబడ్డాయి. ఈజిప్ట్ 22.3 శాతం నామినేషన్లతో అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానంలో సౌదీ అరేబియా నిలిచింది. యూఏఈ 10.9 శాతంతో మూడో స్థానం దక్కించుకుంది. చివరిస్థానంలో 3.6 శాతంతో కువైట్ నిలిచింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







