గల్ఫ్‌లో తెలంగాణ కార్మికుల సెంట్రలైజ్డ్ డేటా
- May 10, 2017
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారి సమాచారం కోసం సెంట్రలైజ్డ్ డేటా బ్యాంక్ ఏర్పాటు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై ఎఫైర్స్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ని ఢిల్లీలో కలిసి పలు అంశాలపై చర్చించారు. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్ మరియు బహ్రెయిన్ రాయబారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తోన్న ఇండియన్ వర్కర్స్‌కి సంబంధించిన సెంట్రలైజ్డ్ డేటా ఆవశ్యకతను సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొచ్చారు కెటియార్. గల్ఫ్ దేశాల్లోని యజమానులు, బలవంతంగా ఇండియన్ వర్కర్స్ పాస్‌పోర్టులు తీసుకోవడంపై స్పందించి, తగు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారాయన. గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలపై, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులతో మూడు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని కెటియార్‌కి హామీ ఇచ్చారు సుష్మా స్వరాజ్.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







