చాట్ విత్ కప్స్
- May 10, 2017
కావాల్సిన పదార్థాలు: మైదాపిండి - పావుకిలో, మిరియాల పొడి - అర టీ స్పూను, జీలకర్ర పొడి - అర టీ స్పూను, కారం, ఉప్పు - తగినంత, ఉడికించిన ఆలు గడ్డలు - మూడు, గరం మసాలా - అర టీ స్పూను, క్యారెట్ తురుము - ఒక కప్పు, ఉల్లిగడ్డలు - మూడు, కొత్తిమీర - ఒక కట్ట, సోడా - చిటికెడు, టమాటసాస్ - ఒక కప్పు, పెరుగు - ఒక కప్పు, టమాటాలు - రెండు, చాట్ మసాల - ఒక టీ స్పూను, నూనె - సరిపడా, సన్నని కారంపూస - ఒక కప్పు.
తయారుచేయు విధానం: ముందుగా మైదాపిండిలో మిరియాలపొడి, జీలకర్రపొడి, సోడా, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి పూరీ పిండిలా కలుపుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. తరువాత చిన్న సైజు గిన్నెకు వెనుక నూనె రాసి దానికి పూరీని వేసి ఈ గిన్నెతో సహా పూరీని నూనెలో వేసి వేయించాలి. పూరి వేడి కాగానే గిన్నెనుండి విడిపోతుంది. ఈ విధంగా ముందుగా కావల్సివన్నీ కప్స్‌ని తయారు చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం ఉడికించిన ఆలుగడ్డలను ముద్దగా చేసి అందులో ఉప్పు, కారం, గరంమసాలా, చాట్ మసాలా వేసి ఉంచుకోవాలి. ముందుగా కప్పు చుట్టూ టమాట సాస్ లేదా స్వీట్సాస్ రాసుకొని అందులో ఈ ఆలుగడ్డను స్టఫ్ చేయాలి. దానిపై వరసగా సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, క్యారెట్, టమాట సాస్, కొత్తిమీర వేసి చివరగా ఒక చెంచా పెరుగు వేసుకుని గార్నిష్ చేయాలి. ఇప్పుడు చాట్ విత్ కప్స్ తినడానికి రెడీ.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







