జూన్ 2న విడుదల కాబోతున్న రాజ్‌తరుణ్ `అంధగాడు`
- May 10, 2017
మల్టీ టాలెంటెడ్, ఎనర్జిటిక్ యాక్టర్ రాజ్‌తరుణ్ పుట్టినరోజు నేడే(మే 11). ఇప్పుడు రాజ్‌తరుణ్ `అంధగాడు`గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్‌తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్‌హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`
ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈడోరకం-ఆడోరకం, కుమారి 21ఎఫ్ వంటి హిట్ చిత్రాలు తర్వాత రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ హిట్ కాంబినేషన్లో రిపీట్ అవుతుంది. . రాజ్‌తరుణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ `అంధగాడు` మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు. భవిష్యత్‌లో ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అసోసియేట్ కానున్నారు.
డిఫరెంట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాజ్‌తరుణ్‌కు హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంది. రాజ్‌తరుణ్ పుట్టినరోజు సందర్భంగా `దెబ్బకు పోయే పోయే..` అనే సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన సాంగ్స్‌ను సోషల్ మీడియా, ఎఫ్.ఎం. రేడియో స్టేషన్స్‌లో విడుదల చేయనున్నారు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షను నిర్వహించి జూన్ 2న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









