తెలంగాణ కు పెద్ద ప్రమాదమే తప్పింది
- May 11, 2017
ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ సగానికిపైగా పడిపోతే.. కరెంటు బిల్లు తగ్గుతుంది లెమ్మని మనుషులు సంతోషపడతారేమో కాని విద్యుత్ గ్రిడ్ మాత్రం ప్రాణమున్న మనిషిలా వణికిపోతుందట. వణికిపోవడం మాత్రమే కాదు. డిమాండ్ పెరగకపోతే గ్రిడ్ కుప్పకూలి రాష్ట్రం మొత్తం కూడా చీకటిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాన్స్‌కో, జెన్కో అప్రమత్తంగా వ్యవహరించడంతో తెలంగామ పెద్ద గండం నుంచి తప్పించుకున్నట్లయింది.
మంగళవారం రాత్రి ఆకస్మికంగా గాలివాన రేపిన దుమారంతో తెలంగాణ విద్యుత్ గ్రిడ్ వణికిపోయింది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అకస్మాత్తుగా పడి పోయింది. దాంతో, బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 7,177 మెగావాట్లున్న విద్యుత్ డిమాండ్ కాస్తా అర్ధరాత్రి 11.59 గంట ల ప్రాంతంలో ఒక్కసారిగా 3,459 మెగావాట్లకు పడిపోయింది. ఇలా డిమాండ్ ఒక్కసారిగా సగా నికి పైగా తగ్గిపోవడంతో విద్యుత్ గ్రిడ్ కుప్ప కూలి రాష్ట్రమంతటా చీకటయ్యే ప్రమాదం ఏర్పడింది
విద్యుత్ డిమాండ్‌కు సమానంగా సరఫరా ఉంటేనే గ్రిడ్ సురక్షితంగా ఉంటుంది. హెచ్చుతగ్గులుంటే గ్రిడ్ కుప్పకూలి రాష్ట్రమంతటా అంధకారం నెలకొనే ప్రమాదముంటుంది. దాంతో థర్మల్ కేంద్రాలను బొగ్గుకు బదులు ఆయిల్‌తో నడిపి అప్పటికప్పుడు విద్యుదుత్ప త్తిని తగ్గించినట్టు ట్రాన్స్‌కో ఇన్చార్జి సీఎండీ సి.శ్రీనివాసరావు తెలిపారు.
మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిని దక్షిణ తెలంగాణలో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) పరిధిలో మంగళవారం మధ్యాహ్నం గరిష్టంగా 5,003 మెగావాట్లుగా నమోదైన విద్యుత్ డిమాండ్ అర్ధరాత్రి వర్షం కారణంగా 2,160 మెగావాట్లకు పడిపోయింది. ప్రధానంగా హైదరాబాద్‌లో రాత్రంతా చీకట్లు నెలకొన్నాయి. ట్రాన్స్‌కో, జెన్కో అప్రమత్తంగా వ్యవహరించడంతో గండం గడిచింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









