'ఇన్ స్టాల్ మెంట్స్' కట్టలేక కారు అమ్మేసిన పవర్ స్టార్
- May 11, 2017
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఓ మీటింగ్ లో తన ఆర్ధిక బాధల గురించి బహిరంగంగా వెల్లడించిన సంగతి విధితమే.. సినిమాలను డబ్బుల కోసమే చేస్తున్నానని కూడా చెప్పారు.. కాగా మళ్ళీ తాజాగా పవన్ కల్యాణ్ ఆర్ధిక బాధల గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ జనసేన కార్యాలయంలో ఇంజినీరింగ్ విద్యార్ధులు, గ్రూప్ 2 విద్యార్ధులు పవన్ ను కలవడానికి వచ్చిన సమయంలో.... పవన్ ని మంత్రి నారాయణ కొడుకు డ్రైవ్ చేస్తున్న కారు మీదేనా? అని ఓ విద్యార్థి ప్రశ్నించగా... ఆ వాహనం తనది కాదని... కానీ గతంలో తాను చాలా ఇష్టపడి బెంజ్ కారును కొనుక్కున్నానని... కానీ నెలల వారీ " ఇన్ స్టాల్ మెంట్స్ " కట్టలేక ఆ కారుని అమ్మేసి నట్లు చెప్పారు.. అంతేకాదు.. నేను వాడిన బెంజ్ తర్వాత మోడల్ ను నిషిత్ కొనుగోలు చేసాడని వివరణ ఇచ్చారు. పవన్ చెప్పిన సమాధానంతో రెండు విషయాలపై క్లారిటీ వచ్చింది.. ఒకటి నిషిత్ వాహనం పవన్ ది కాదు.. పవన్ ఆర్ధికబాధల్లో ఉన్నారు అన్నది నిజమేనని..
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







