తగ్గుతున్న బంగారం ధర
- May 11, 2017
ముంబై: విలువైన లోహం బంగారం ధరలు అంతకంతకూ దిగి వస్తున్నాయి. ముఖ్యంగా ఎంసీఎక్స్ మార్కెట్‌లో గురువారం రూ.28 వేలకు దిగువకు చేరింది. గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్న పుత్తడి పది గ్రా. రూ. 34 నష్టంతో రూ. 27,962 వద్ద ఉంది. బులియన్ మార్కెట్ లో రెండు రోజుల కిందట స్వల్పంగా పెరిగినప్పటికీ ఈ రోజు ట్రేడింగ్‌లో మరోసారి పతనమైంది. 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.265 తగ్గి రూ.28,400 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 26,650కు చేరుకుంది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట‌్‌లోనూ పసిడి ధరల పతనం కొనసాగుతోంది. ఔన్సు బంగారం ధర 1219 డాలర్ల దగ్గర ఫ్లాట్‌గా కొనసాగుతోంది. మంగళవారం 1213 డాలర్లకు తగ్గి ఎనిమిది వారాల కనిష్ఠానికి చేరగా, బుధవారం 0.2 శాతం క్షీణించి ఔన్స్ ధర 1218.7 డాలర్డ వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలు, మైన్స్ ఎదుర్కొంటున్న సంక్షోభం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫ్‌బీఐ చీఫ్ జేమ్స్ కామీ పై వేటు, ఫెడ్ వడ్డీరేట్ల పెరుగుదల అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇక ముందు కూడా కొనసాగే అవకాశాలున్నాయని ఏంజిల్ కమొడిటీస్ అంచనా వేసింది.
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో బంగారం ధరలు తగ్గుదలకు కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.205 తగ్గి రూ.38,100 వద‍్ద ముగిసింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర 0.19శాతం తగ్గి 1,218.80 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







