ఎయిర్ అంబులెన్స్ కోసం కొత్త కేంద్రం ప్రారంభం
- May 12, 2017
ఎయిర్ అంబులెన్స్ సేవాకేంద్రం స్థాపించటం ద్వారా ఆరోగ్య సంరక్షణ శాఖకు ఎంతో ప్రోత్సాహకరం అని ఆరోగ్య మంత్రి డాక్టర్ జమాల్ అల్ హర్బి పేర్కొన్నారు గురువారం ఉదయం ఆయన ఎయిర్ అంబులెన్స్ సర్వీసు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో తెలిపారు. అల్ సబ మెడికల్ ఏరియాలో ఉన్న కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రిత్వశాఖ అరోగ్య రక్షణా సేవలను అందించడానికి ఏ ఒక్కరిని వదిలివేయకూడదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, రోడ్డు మరణాలను అరికట్టడానికి మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రణాళికలను ఆయన ప్రస్తావించారు, మరియు నూతన ఎయిర్ అంబులెన్స్ సెంటర్ ప్రారంభం మే 8-14 నుండి అమలు అవుతున్న ఐక్యరాజ్యసమితి రోడ్ సేఫ్టీ వీక్ తో సమానంగా ఉందని సూచించింది.14,000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల నూతన భవనం 4.750 మిలియన్ కువైట్ దినార్ల వ్యయంతో నిర్మియించిందని, అంతేకాకుండా ఎయిర్ అంబులెన్స్ లో పనిచేసే సిబ్బంది క్లిష్టమైన కేసులు మరియు అత్యవసర పరిస్థితులతో వ్యవహరించడానికి వారు ప్రత్యేక శిక్షణ పొందారు అని వివరించారు .భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఎయిర్ అంబులెన్స్ సేవ కోసం రెండు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది అని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







