వివాహంలో పెను విషాదం
- May 12, 2017
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో మ్యారేజ్ హాల్ గోడ కూలి 24 మంది మరణించారు. బుధవారం నాడు జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. భారీ వర్షలకు నానిపోయిన 12 అడుగుల ఎత్తయిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో పెళ్లి జరుగుతోంది. పెళ్లికి వచ్చిన అతిధులపై గోడ కూలిపోయింది. కాగా కళ్యాణ మండపానికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేదు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వసుందరరాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండేసి లక్షలు రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేల ఆర్థిక సహాయం ఇస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







