25 ఫ్లాట్లు దానం చేయనున్నబాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్
- May 12, 2017
అమరవీరుల కుటుంబాలకు తన వంతు సాయం చేసేందుకు బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ముందుకు వచ్చాడు. మహారాష్ట్రలోని థానెలో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్ఫీఎఫ్) అమర సైనికుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు దానం చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సీఆర్ఫీఎఫ్‌కు లేఖ రాశాడు.
వివిధ ఘటనల్లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సీఆర్ఫీఎఫ్ అమరవీరుల కుటుంబాలకు తన కంపెనీ కరమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ తరపున 25 ఫ్లాట్లు నిర్మించి ఇవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇప్పటికే నాలుగు ఫ్లాట్లు ఇచ్చినట్టు సమాచారం. ఎంపిక చేసిన కుటుంబాల పేర్లతో జాబితాను కరమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విడుదల చేసింది.
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన 12 మంది సీఆర్ఫీఎఫ్ సైనికుల కుటుంబాలకు హీరో అక్షయ్‌కుమార్ ఇంతకుముందు రూ. 1.08 కోట్ల విరాళం ప్రకటించాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







