నిర్మాతగా మారుతున్న హీరోయిన్ ప్రణీత సుభాష్
- May 12, 2017
హీరోయిన్గా టాప్ హీరోల సరసన సినిమాలు చేసినా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన హీరోయిన్ ప్రణీత సుభాష్. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. ప్రణీతకు రావాల్సిన స్ధాయిలో గుర్తింపు రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు టాటా చెప్పేసిన ఈ భామ తమిళ కన్నడ సినిమాల మీద దృష్టి పెట్టింది. అక్కడ అవకావాలు బాగానే వస్తున్న స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.
దీంతో బిజినెస్ మీద దృష్టి పెట్టిన ప్రణీత, హోటల్ రంగంలోకి అడుగుపెట్టి మంచి విజయం సాధించింది. అదే జోరులో ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉంది. హీరోయిన్ గా కొనసాగుతూనే స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నిర్మాతగా మారేందుకు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసిందట. త్వరలోనే తన బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమాపై ప్రకటన చేయనుంది.. ఈ సాండల్వుడ్ బ్యూటీ.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







