హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం
- May 12, 2017
నగరంలోని అప్జల్‌గంజ్ ప్రాంతంలో గల సుల్తాన్‌షాహీలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముక్తార్గంజ్లోని టైర్లు, వాహనాల బేరింగ్లు విక్రయించే దుకాణాల సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి ఉవ్వెత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై పరుగుతీశారు. స్థానికులు సమాచారంతో సుమారు 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.
షాపులు ఇరుకుగా ఉండటంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కొంత ఇబ్బందిపడ్డారు. ఈ ప్రమాదంలో 25 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఇందులో ఆరు మోటార్ షాపులున్నాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. దుకాణ సముదాయం మూసివుండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద నష్టం అంచనా వేసేందుకు వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







