మిడిల్ ఈస్ట్ టాప్ పవర్ఫుల్ లిస్ట్‌లో సోహన్ రాయ్
- May 13, 2017
యూఏఈ బేస్డ్ మిలియనీర్ మరియు ఫిలాంత్రపిస్ట్ సోహన్ రాయ్, మిడిల్ ఈస్ట్ 2017 ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ పవర్ఫుల్ మరియు ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో సోహన్ రాయ్ చోటు దక్కించుకోవడం ఇది ఐదోసారి. కేరళ నుంచి, యూఏఈకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారాయన. వృత్తి రీత్యా నేవల్ ఆర్కిటెక్ట్ అయిన సోహన్రాయ్కి, సినీ నిర్మాణంపై అభిరుచి ఎఉ్కవ. ఏరీస్ గ్రూప్ ఛైర్మన్ మరియు సీఈఓగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు సోహన్ రాయ్. ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో 45 కంపెనీలను నిర్వహిస్తున్నారాయన. ఏరీస్ మెరైన్, ఐఎస్ఓ సర్టిఫైడ్ నేవల్ ఆర్కిటెక్చర్ మరియు మెరైన్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. ఏరీస్ గ్రూప్ నుంచి ఏరీస్ ప్లెక్స్ - ఆసియాలో తొలి డ్యూయెల్ 4కె ప్రొజెక్షన్ థియేటర్ని కేరళలోని త్రివేండ్రమ్‌లో కలిగి ఉంది. ఏరీస్ విస్మయా మ్యాక్స్ స్టూడియోని కూడా నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 1400 మంది ఉద్యోగులున్నారు. ఇండియాలోనే ఈ సంస్థ 400 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. సోహన్‌రాయ్, హాలీవుడ్ డెరెక్టోరియల్ వెంచర్ డామ్999 అనేక అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఇండీవుడ్ ఫౌండర్ డైరెక్టర్‌గానూ సోహన్‌రాయ్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.


తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







