గాలి బుడగ

- October 06, 2015 , by Maagulf

ఒక్కో ఇటుక పేర్చి ఎంతో  కష్ట నష్టాలకు ఓర్చి 
కట్టుకుంటాడు ఆమెకోసం... ఒక ఆశల సౌధం 

తడబడే మాటలను అటు తిప్పి .. ఇటు తిప్పి 
పదాలతో అల్లుతాడు ఆమెకోసం ఒక నవ్వుల హారం

అక్షర పూ రాణుల కవ్వించి కాసింత తేనే పట్టి 
వండుతాడు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రేమ పాకం 
ఆమె కోసం 

ఆచి తూచి అడుగులేస్తూ కొద్ది కొద్దిగా మచ్చిక 
చేసుకుంటూ లేని లేడి ముసుగు కప్పుకొని 
నక్క వినయంతో 

మెల్లి మెల్లిగా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ 
సాగుతుంటాడు ఆమె వైపూ పిల్లిలా.. 

ఆమెనేమో 'అట్టా సూడమాకయ్య' అంటూ 
వయ్యారాలు పోతూ ... కవ్విస్తూనే 

కాస్త బిడియం కాస్త బెరుకు ప్రదర్శిస్తూ 
తన ఆకర్షణలోకి లాగుతూ ... 

కొంచెం లయ తప్పిన అతని నడవడికను  
కోపగించుకుంటూ 

ఓయ్ ఏంటి గోల "పసి(వాడి)దాని" ముందు 
పిచ్చి పిచ్చి వేసాలేస్తే బాగుండదు అని హెచ్చరిక చేసి 
కిసుక్కున నవ్వుకుంటూ

అతన్ని నిలువునా గాలి తీసిన బుడగలా మార్చుతుంది... 

ఇంకేం జరుగునో అను ఉత్సుకత కలిగిన
చూసే నేను కవినే కాబోలు,

కాని నేను అతనిలాగే కొంచెం
రస హృదయున్నేగా

ఆమె తాకిడికి నేను కూడ తోక ముడిచి
పరుగో పరుగు

పాపం అతనేం చేస్తాడు ఇక...తిరిగి మళ్లీ దయతో
ఆమె కరుణించే వరకు 

అతని గారడీల్లాంటి గిరికీల్లో ఎడ తెరిపి లేని
ఈదులాటల అత్యాశలో ఈదటం తప్ప ఆమెకోసం ... 

 

-- జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com