20 న మే విడులకానున్న 'వైరస్' ఆడియో
- May 13, 2017
సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్ ద్వయం సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియోను మే 20న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సలీమ్.ఎం.డి మాట్లాడుతూ.. "హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "వైరస్" సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 20న పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: వి.జె, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, మాటలు: దుర్గాప్రసాద్ రాయుడు, నిర్మాతలు: సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఆర్.కృష్ణ!
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







