రేగిపట్టీ
- May 13, 2017
కావలసిన పదార్థాలు
రేగిపండ్లు- రెండు కప్పులు, నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర- ఆరు టీ స్పూన్లు, బాదం, జీడిపప్పు- చెరో టీ స్పూను.
తయారీ విధానం
రేగిపండ్లలో విత్తనాలను తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నెయ్యి పోసి వేడెక్కాక రేగి పండ్ల ముక్కలను వేసి 5 నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత చక్కెర, నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు కూడా వేయాలి. చక్కెర పూర్తిగా కరిగేదాకా వేగించి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేటులో సమానంగా పోసి చల్లార్చిన తర్వాత ముక్కలుగా కత్తిరించుకోవాలి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







