అభిమాని చేసిన పనికి సినీ నటుడు హీరో విజయ్ పై కేసు నమోదు
- May 14, 2017
సినీ హీరోలపై అభిమానం హద్దులు దాటితే.. ఒక్కొక్కసారి తమ అభిమానులు చేసే పనులు ఆ హీరోలకు ఇబ్బందులను సృష్టిస్తాయి.. ఇక తమిళనాడులో హీరోల అభిమానులు తమ హీరోలపై ప్రేమను చూపించే విధానం కాస్త ఓవర్ గా ఉండడమే కాదు.. అతి కూడా ఉంటుంది అన్న సంగతి విధితమే.. తాజాగా సోషల్ మీడియా వచ్చాక తమ హీరోలపై తమకి ఉన్న అభిమాననం చూపించుకోవాలనే తపన మరీ ఎక్కువైంది అని చెప్పవచ్చు.. అలా ఓ వీరాభిమాని తన అత్యుత్సాహం తో చేసిన పని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలకు చుట్టుకొన్నది.. వివరాల్లోకి వెళ్తే...
ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వేడుకగా తమ ఫోటో షాప్ పనితనాన్ని ప్రదర్శిస్తూ.. తమ అభిమాన హీరోలతో రకరకాల వేషాలు వేయిస్తున్నారు.. ఈ నేపద్యంలో ఓ అభిమాని తన అభిమాన హీరో విజయ్ ను శివుడిగా క్రియేట్ చేస్తూ.. చేతిలో ఓ త్రిశూలం పెట్టి ఓ ఇమేజ్ ను రెడీ చేసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. వైరల్ గా మారిన ఆ ఫోటో సోషల్ మీడియాలో దుమారం క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే... ఈ ఫోటోలో విజయ్ ఒక్క త్రిశూలం మాత్రమే పట్టుకోవడమే కాదు.. కాళ్లకు షూష్ కూడా ధరించి ఉన్నాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫోటో పై హిందూ మక్కల్ పార్టీ మండిపడుతుంది.. పాదరక్షలు ధరించి త్రిశూలం చేత పట్టడం హుందువుల మనోభావాలను దెబ్బతీయమేనని పేర్కొంటూ హీరో విజయ్ పై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- Mohammed bin Rashid Leadership Forum: Leaders and experts outline priorities for Dubai’s next phase of growth
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







