ఆరునూరైనా అక్కడే అంటోన్నజనసేన అధినేత పవన్ కళ్యాణ్
- May 14, 2017
ఆరునూరైనా అనంతపురం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. త్వరలోనే అనంతపురంలో పాదయాత్ర నిర్వహిస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేస్తానని.. తన తుది శ్వాస వరకూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని చెప్పారు.
తనను కొందరు పార్ట్ టైం పొలిటీషియన్ అంటున్నారని, అసలు పూర్తిగా రాజకీయాల్లో ఎవరున్నారన్నారని ప్రశ్నించారు. ఒక్కో నాయకుడు కోట్ల రూపాయలు ఆర్జించి ఇంట్లో కూర్చున్నారని, ఇంట్లోనే ఉండి రూ.కోట్లు సంపాదించే ఏర్పాట్లు చేసుకున్నారని పవన్ ఆరోపించారు. తాను మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన తన సిబ్బంది కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. జన సేనలో స్పీకర్స్, కంటెంట్ రైటర్స్, అనలిస్ట్ లుగా పనిచేసేందుకు ముందుకొచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన దాదాపు 150మంది నూతన నాయకులతో పవన్ సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







