అంతర పాఠశాలల క్రికెట్ పోటీలలో న్యూ మిలీనియం జట్టు విజేత
- May 14, 2017
రిఫెలో నేషనల్ స్టేడియం మైదానంలో16 సంవత్సరాల లోపు అంతర పాఠశాలల క్రికెట్ పోటీల ప్రారంభ మ్యాచ్ లో న్యూ మిలీనియం స్కూల్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీలో రెస్ట్ ఆఫ్ ది స్కూల్ క్రికెట్ జట్టును 109 పరుగుల తేడాతో ఓడించింది.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ మిలీనియం స్కూల్ క్రికెట్ జట్టు, తన ప్రత్యర్థి రెస్ట్ ఆఫ్ ది స్కూల్ క్రికెట్ జట్టుపై భారీ స్కోర్ నమోదు చేసింది. నాలుగు వికెట్ల నష్టానికి 20 ఓవర్ల కు 200 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఏర్పరిచింది. న్యూ మిలీనియం స్కూల్ క్రికెట్ జట్టులో స్కిప్పర్ జగన్ బ్యాటింగ్ అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని కనబర్చాడు. 74 బంతుల్లో131 పరుగులు సాధించి నాట్ అవుట్ గా నిలిచి జట్టు గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. స్కిప్పర్ జగన్ కు తోడుగా మరో బ్యాట్స్ మన్ విజయాకుమార్ నిలిచాడు. వారి ఇరువురి భాగస్వామ్యంలో న్యూ మిలీనియం స్కూల్ క్రికెట్ జట్టు పెద్ద స్కోర్ చేసింది. కాగా, ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ది స్కూల్స్ 20 ఓవర్లలో 91 పరుగులు మాత్రమే చేయగలిగారు.ఆ జట్టు కెప్టెన్ సచిరు అజిత్ 25 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఎనిమిది జట్లు పాల్గొంటున్న16 ఏళ్ళ లోపు అంతర పాఠశాలల క్రికెట్ పోటీలలో ఎంపిక చేసిన ఉత్తమ ఆటగాళ్లతో 2017 సెప్టెంబర్‌లో కతర్ లోని ఐసిసి-పశ్చిమ దేశానికి (ఎసిసి) టోర్నమెంట్ కోసం బహ్రెయిన్ నేషనల్ అండర్ 16 జట్టును ఎంపిక చేయనున్నారు.
ఇతర జట్లు స్కోర్లు ఈ విధంగా ఉన్నాయి :
పాకిస్థాన్ స్కూల్ 148/3 (జుల్ఫిఖర్ 62 రిటైర్డ్ హర్ట్ , ఫుర్కాన్ 19, హమీద్ 15 నాట్ అవుట్ మిఖాయిల్ 2/13) .అదేవిధంగా, 20 ఓవర్లలో బ్రిటిష్ స్కూల్ (కంబైన్డ్) 147 (జార్జి అక్స్టెల్ 29, సినాన్ సైఫ్ 28, తుషార్ షెట్టీ 27) నాలుగు వికెట్లు నష్టానికి అలాగే, బహ్రెయిన్ జట్టు 94 (సాహిల్ప్రీత్ సింగ్ 4/10, మొహమ్మద్ ముఫ్లియా, అద్నాన్ ఖాన్, కరణ్ రావల్ 2 ఓవర్లు) తొమ్మిది వికెట్ల తేడాతో 16 ఓవర్లలో భారతీయ స్కూల్ 95/1 (శివక్రిష్ణన్ 41, అనుజ్ రమేష్ 25).
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







