రాఘవేంద్ర తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్ సినిమా
- May 14, 2017
బహుబలి వంటి సినిమాని అత్యంత సుందరంగా నిర్మాత్మక విలువలతో తెరకెక్కించిన సంస్థ బాహుబలి తో హిస్టరీ క్రియేట్ చెయ్యడమే కాదు.. సక్సెస్ తో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొన్నారు. కాగా ఈ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లు నిర్మించే నెక్స్ట్ మూవీ వివరాల్లోకి వెళ్తే...
ఒక తెలుగు సినిమాకి యాభై కోట్లు బడ్జెట్ పెట్టడం అంటేనే సాహసం గా చెప్పుకునే టైమ్ లో, రెండు సినిమాల కోసం దాదాపు 500ల కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్. ఆర్కా మీడియా బ్యానర్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చెరిగిన పోని రికార్డులు అందుకొన్నాయి. బాహుబలి లాంటి సినిమాల తర్వాత ఆర్యా మీడియా బ్యానర్లో ఎలాంటి సినిమా రాబోతుంది. అనే ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. ఈ నిర్మాతలు కూడా ఈ సారి చిన్న సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఆర్యా మీడియా నెక్ట్స్ మూవీ చేయబోతుంది. ప్రకాష్ కోవెలమూడి డైరెక్షన్లో బాహుబలి నిర్మాతలు చేయబోయే సినిమాలో హీరోగా నటించబోయేది శర్వానంద్. వరసు విజయాలు అందుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటున్న శర్వానంద్ ని, తమ హీరోగా ఫిక్స్ చేసుకున్నారు శోభు యార్లగడ్డ అండ్ దేవినేని ప్రసాద్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







