రష్యన్ సలాడ్ శాండ్విచ్
- May 15, 2017
కావలసిన పదార్ధాలు: తరిగి, ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు - ముప్పావు కప్పు (క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ) , రెడీమేడ్, మయొనీస్ - అర కప్పు , ఫ్రెష్ క్రీమ్ - 2 టే.స్పూన్లు , పైనాపిల్ ముక్కలు - అర కప్పు , ఉడికించిన బంగాళాదుంప ముక్కలు -అర కప్పు , ఉప్పు - రుచికి సరిపడా , బటర్ - 4 టే.స్పూన్లు , బ్రెడ్, స్లయిసెస్ - 8 , మిరియాల పొడి - 1 టీస్పూను.
తయారీ విధానం: మయొనీస్, కూరగాయ ముక్కలు, క్రీమ్, పైనాపిల్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 4 సమభాగాలుగా విడదీసి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లయిసెస్కు ఓవైపు బటర్ పూసి సలాడ్ మిశ్రమాన్ని వేసి స్ర్పెడ్ చేయాలి. బటర్ పూసిన మరో బ్రెడ్ స్లయిస్ పైన ఉంచాలి. ఇలా అన్నీ తయారుచేసుకున్న తర్వాత కత్తితో క్రాస్‌గా కట్ చేసుకోవాలి.
టమాటో కెచప్, పొటాటో చిప్స్‌తో సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







