‘కేశవ’ సెన్సార్ పూర్తి, 19న గ్రాండ్ రిలీజ్
- May 15, 2017
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘కార్తికేయ’... మూడేళ్లుగా నిఖిల్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వటమే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ సాంధించాడు నిఖిల్ సూపర్‌హిట్ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరొక్కసారి డిఫిరెంట్ పాయింట్ తో మే 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం కేశవ. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాత. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి కాళభైరవ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం క్రియెట్ చేయగా, రెండవ సాంగ్ ని హీరో నిఖిల్ యుస్ లో శ్రీ సాయిదత్తా పీఠం లో సుమారు వెయ్యమంది తెలుగు సినిమా అభిమానుల సమక్షంలో విడుదల చేశాడు. మే 19న సమ్మర్ కానుకగా కేశవ ప్రేక్షకులు ముందుకు రానుంది.
రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్.,
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









