ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- May 16, 2017
26 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకోగానే రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ అలర్ట్ అయ్యింది. ఘటనా ప్రాంతానికి ట్రాఫిక్ పోలీసుల్ని, అంబులెన్సుల్నీ, అలాగే పారామెడిక్స్నీ పంపింది రికార్డు సమయంలో. అయితే జరిగిన ప్రమాదంలో ఎమిరేటీ వ్యక్తి తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలియవస్తోంది. ఇంకో వైపున, ఈ ప్రమాదానికి మరో కారు కూడా కారణంగా పోలీసులు గుర్తించారు. అతివేగంతో దూసుకు వెళుతున్న కారు, అనుకోకుండా అదే రూట్లోకి వచ్చిన మరోకారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా కనిపించింది. ఈ కారణంగా ప్రమాదం నుంచి బాధితుడు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. గతంలో ఇదే తరహాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం 47 ఏళ్ళ ఫిలిప్పినా వ్యక్తి మృతికి కారణమయ్యింది. అలాగే 2017 మే 7న జరిగిన మరో ప్రమాదంలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







