హ్యూమన్ ట్రాఫికింగ్ 106 మంది అరెస్ట్
- May 16, 2017
హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడ్డ కారణంగా యూఏఈలో గత ఏడాది 106 మంది అరెస్టయ్యారు. మొత్తం 25 కేసుల్లో, 34 మంది బాధితుల్ని గుర్తించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అన్వర్ మొహమ్మద్ గర్గాష్ ఈ వివరాలు వెల్లడించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌ని అడ్డుకోవడంలో యూఏఈ గణనీయమైన ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నేషనల్ కమిటీ టు కంబాట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఛైర్మన్ కూడా అయిన డాక్టర్ గర్గాష్, 216లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రిపోర్ట్‌ని ప్రారంభించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌ని అడ్డుకోవడానికి ఇంకా ఏయే విభాగాల్లో లోతుగా పనిచేయాల్సి ఉందో, ఆయా విభాగాల్ని గుర్తించి మరింత సమర్థవంతంగా పనిచేస్తామని తెలిపారాయన. సమాజంలో విలువలకు హ్యూమన్ ట్రాఫికింగ్‌తో దెబ్బ తగలకూడదనీ, మానవత్వ విలువలకు హ్యూమన్ ట్రాఫికింగ్ మచ్చగా మారిందని చెప్పారు గర్గాష్. 25 కేసుల్లో 9 కన్విక్షన్స్, అలాగే దోషులకు ఏడాది నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడినట్లు నేషనల్ కమిటీ టు కంబాట్ హ్యూమన్ ట్రాఫికింగ్ వెల్లడించిన వివరాల్ని బట్టి అర్థమవుతోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







