సౌదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ డీల్
- May 20, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన సౌదీ అరేబియాలో ఘనంగా ప్రారంభమైంది. సౌదీ అరేబియాతో 110 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.1లక్షల కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందాన్ని అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా రక్షణ పరికరాలు, సేవలను సౌదీ కొనుగోలు చేసింది. స్వదేశంలో తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నా తొలి విదేశీ పర్యటనకు వచ్చిన ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌లకు రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
కాఫీ మీటింగ్ అనంతరం రాజప్రాసాదంలో ట్రంప్‌నకు సౌదీ అత్యుతన్న పౌర పురస్కారం కాలర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌ను బహూకరించారు. అనంతరం రాజు సల్మాన్‌తోపాటుగా ఇద్దరు యువరాజులతోనూ ట్రంప్ భేటీ అయ్యారు. ఈ పర్యటన సందర్భంగా ఆయుధ ఒప్పందతోపాటుగా 15 బిలియన్ డాలర్ల ఇతర ఒప్పందాలూ కుదుర్చుకోనున్నట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







