ఇరాక్‌లో ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
- May 20, 2017
ఇరాక్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్‌లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఆత‍్మాహుతి దాడులకు పాల్పడ్డారు. అబు షీర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన వరుస దాడుల్లో 18 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు.
ముందుగా పోలీస్ చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో చెక్ పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన అనంతరం.. పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకొని ఇదే తరహాలో మరోదాడికి పాల్పడ్డారు. మొదటి దాడి తీవ్రత ఎక్కువగా ఉందని అంతర్గత వ్యవహారాలశాఖ అధికారి వెల్లడించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఈ ఘటనకు బాధ్యులం తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు. ఇటీవల అక్కడి బస్రా ప్రాంతంలో జరిగిన దాడిలో 13 మంది మృతి చెందగా 30 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇరాక్‌లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తరచుగా ఇలాంటి దాడులకు పాల్పడుతోంది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







