కెనడాలోని చిన్నారిని నీళ్లలోకి లాగేసిన సీల్
- May 22, 2017
సరస్సులు, సముద్రాల్లో జలచరాలు కనబడగానే వాటికి ఏదో ఒక ఆహారాన్ని విసరడం మనలో చాలామందికి అలవాటు. కెనడాలోని వాంకోవర్‌లో కూడా కొందరు వ్యక్తులు ఇలాగే ఓ సీల్‌ను చూసి ఆహారాన్ని విసిరారు. ఆహారాన్ని తినేసి ఎగిరి మళ్లీ వెంటనే వెనక్కి వెళ్లిపోయింది. ఇంతలోనే మళ్లీ వచ్చిన ఆ సీల్ అక్కడే వున్న ఓ చిన్నారి డ్రెస్ పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. ఇది చూసిన ఓ వ్యక్తి వెంటనే దూకి చిన్నారిని రక్షించి పైకి తీసుకువచ్చాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి గానీ ఆ వ్యక్తికి గానీ ఎలాంటి హానీ జరగలేదు. ఊహించని ఈ పరిణామానికి చిన్నారి కుటుంబం షాక్‌కు గురైంది. ఈ ఘటనంతా మైఖెల్ ఫుజివారా అనే వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయగా అవి వైరల్ అయ్యింది.
తాజా వార్తలు
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!







