తమిళసూపర్ స్టార్ రజనీకి బిజెపిలో పోస్ట్ రెడీ
- May 22, 2017
తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి గత కొంతకాలంగా ఎన్నోవార్తలు. జయలలిత మరణంతో వీటిజోరు మరింత పెరిగింది. బిజెపి దన్నుతో రాజకీయాల్లోకి వస్తున్నారని కొన్ని ఊహాగానాలు చెలరేగితే, రజనీ సొంతంగా పార్టీ పెడతారని చాలా మంది భావించారు. దీనికి తోడు ఫ్యాన్స్ తో రజనీ తలపెట్టిన వరుస భేటీలు, ఆయా మీటింగ్స్ లో రజనీ చేస్తున్న వ్యాఖ్యలు వీటికి ఎంతోకంత బలాన్నిస్తున్నాయి.
తాజాగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రజనీ రాజకీయ ప్రవేశం గురించి స్పందించారు. మంచి వ్యక్తులను రాజకీయాల్లో స్వాగతిస్తున్నామంటూ రజనీకాంత్ ను గురించి వ్యాఖ్య చేసిన తర్వాతిరోజే, కేంద్రమంత్రి.. మాజీ బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ రజనీకాంత్ గురించి మరో కామెంట్ వదిలారు. రజనీకాంత్ కు బిజెపిలో సముచితస్థానం ఉంటుందని వ్యాఖ్యానించడం తమిళరాజకీయాలతోపాటు, దక్షిణాదిలోనూ ఇదో హాట్ టాపిక్ అయి కూర్చుంది..
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







