సూర్య , ప్రియ, శరత్‌కుమార్, కట్టప్ప తో సహా తమిళ నటి, నటులకు భారీ షాక్.
- May 23, 2017
తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల అభిమానం చొరగొన్న సూర్య , ప్రియ, శరత్‌కుమార్, సత్యరాజ్ లతో పాటు తమిళం లో ఎంతో గుర్తింపు పొందిన కమెడియన్ వివేక్, వర్ధమాన నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చరణ్‌లకు నీలగిరి జిల్లాకోర్టు వారెంట్లు జారీ చేసి షాక్ ఇచ్చింది. గతంలో పలు సందర్భాల్లో పాత్రికేయులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారని వారంతా కోర్టును ఆశ్రయించారు. దీంతో హీరో సూర్యకు పీటీ వారెంట్ , మిగిలిన ఆరుగురికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్ట్.
పరువునష్టం కేసులో వీరందరికీ వారెంట్లు జారీ అయ్యాయని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏడుగురు ప్రముఖులకు ఒకేసారి వారెంట్లు జారీకావడం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. కోర్టు ఆదేశాలపై నటీనటులు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం వీరంతా వారి వారి సినిమాల తో బిజీ గా ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం







