మొత్తం మీద దిగి వచ్చిన పసిడి ధర
- May 23, 2017
గత కొంత కాలంగా పెరుగుతూ పోయిన బంగారం ధర నెమ్మదిగా దిగి వస్తోంది. మంగళవారం 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.235 తగ్గి రూ.29వేలకు దిగువకు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు ఉండటం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం తగ్గుదలకు కారణమని బులియన్ టేడ్రింగ్ వర్గాలు తెలిపారు. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.28,915 పలికింది. ఇటు బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి రూ.315 పెరిగి, రూ.39,815కు చేరింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.02శాతం తగ్గి 1,260.10 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







