వెజిటేరియన్ హలీమ్
- May 23, 2017
కావలసిన పదార్థాలు: క్యారట్, బీట్రూట్, బీన్స్, బంగాళాదుంపలు, పచ్చిబఠాణీ ముక్కలు: ఒక్కోటి అరకప్పు చొప్పున, పచ్చిమిరపకాయ ముక్కలు: రెండు టేబుల్ స్పూన్లు, గోధుమరవ్వ: అరకిలో, పిస్తా, బాదం, జీడిపప్పు: అరకప్పు చొప్పున, నెయ్యి: పావుకిలో, మిరియాలు: రెండు స్పూన్లు, యాలకులు: నాలుగు, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత, పుదీనా ఆకులు: అరకప్పు, నిమ్మకాయలు: నాలుగు, పాలు: కప్పు, అరటిపండు: ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
తయారీ విధానం: ముందుగా కూరగాయ ముక్కల్ని కుక్కర్లో ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి నీరంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నెయ్యి వేసి బాదం, పిస్తా, జీడిపప్పులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మిగతా నెయ్యి వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయముక్కలు, మిరియాలు, యాలకులు, వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉడికించి పెట్టుకున్న కూరగాయల ముక్కలు, గోధుమరవ్వ, పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు వేయించిన తరువాత కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికిన తరువాత పప్పు గుత్తితో మెత్తగా చేసుకొని వేయించిపెట్టుకున్న జీడిపప్పు, పిస్తా, బాదం జతచేసుకోవాలి. దించేముందు నిమ్మరసం, పుదీనా ఆకులు కలపాలి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







