'జేమ్స్‌బాండ్' కన్నుమూత
- May 23, 2017
ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘జేమ్స్ బాండ్’ పాత్రధారి రోజర్ మూర్ మంగళవారం కన్నుమూశారు. 89ఏళ్ల రోజర్ గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన పలు చిత్రాల్లో బ్రిటీష్ గూఢచారి జేమ్స్ బాండ్ పాత్రను పోషించారు. రోజర్ మూడో బాండ్ పాత్రధారిగా నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 1973 నుంచి 1985 మధ్య కాలంలో వచ్చిని బాండ్ సిరీస్ ఏడు చిత్రాల్లో ఆయన జేమ్స్‌బాండ్‌గా నటించారు.
1927 అక్టోబర్ 14న లండన్‌లోని స్టాక్వెల్లో రోజర్ మూర్ జన్మించారు. ‘లైవ్ అండ్ లెట్ డై’ చిత్రంలో తొలిసారిగా గూఢచారి పాత్ర పోషించి అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు పొందారు. చివరిసారిగా ‘ఏ వ్యూ టూ కిల్’ చిత్రంలో బాండ్ పాత్ర పోషించారు. మొనాకోలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు హాలీవుడ్ నటులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







