టీవీ యాంకర్ రవిపై కేసు నమోదు
- May 25, 2017
మహిళలను కించపరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన యాంకర్ రవిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ సినిమా వేడుకలో నటుడు చలపతిరావు మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఆ షోకు యాంకర్‌గా వ్యవహరించిన రవి సూపర్ అంటూ సమర్థించాడన్నారు.
చలపతిరావుతో పాటు యాంకర్ రవిపై కేసు నమోదు చేయాలని ఈ నెల 23న మహిళా, ప్రజాసంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చలపతిరావుపై అదే రోజు కేసు నమోదు చేయగా, న్యాయ సలహా అనంతరం యాంకర్ రవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
చలపతిరావు, రవిపై ఇప్పటికే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. బండ్లగూడకి చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 ఏ (IV), 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్







