రవితేజ కొత్త సినిమా 'టచ్ చేసి చూడు'
- May 25, 2017
రవితేజ స్పీడ్ పెంచారు. ఆ మధ్య నటనకి కొంత విరామం ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న 'టచ్ చేసి చూడు' చిత్రం ఒకటి. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బేనరుపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు హైదరాబాద్, పాండిచ్చేరిలో జరిగే షూటింగ్లో కీలక సన్నివేశాలు, ఒక ఫైట్, ఛేజ్ చిత్రీకరిస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రవితేజ తన అభిమానుల్ని అలరించే అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







