నేటి నుంచి ఫ్రెంచి ఓపెన్2017 సమరం
- May 27, 2017
రెండో టైటిల్‌పై జకోవిచ్, ముగురుజ కన్ను
తాము రేసులో ఉన్నామంటున్న ముర్రే, హాలెప్
క్లే కోర్టు హీరో నాదల్ పదో టైటిల్‌పై గురి
తొలి క్లే కోర్టు టోర్నీ ఫ్రెంచి ఓపెన్‌లో తమ సత్తా చాటాలని అగ్రశేణి టెన్నిస్ తారలు పోటీ పడుతున్నారు. గ్రాండ్‌స్లామ్‌లో రెండో టైటిల్ ఫ్రైజ్‌మనీ కూడా ఎక్కువే కావడంతో తమ సత్తా చాటాలని యువ టెన్నిస్ తారలు కూడా ఎత్తులు, ఎత్తుగడలతో బరిలో దిగుతున్నారు. బంకమట్టితో ఎంతో వ్యయ ప్రయాసలతో తయారు చేసే ఈ కోర్టులో ఏస్‌లు సంధించి ప్రత్యర్ధులను బెంబెలెత్తించాలని క్రీడాకారులు ఆశపడుతున్నారు. దీంతో ఫ్రెంచి టైటిళ్లు ఎవర్ని ముద్దాడాతాయో అన్న ఆసక్తి నెలకొంది.
పారిస్: రెండో గ్రాండ్‌స్లామ్ పోరుకు పారిస్ నగరం అందంగా ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి జూన్ 11వ తేదీ వరకు 116వ ఫ్రెంచ్ ఓపెన్ సమరానికి అగ్రశేణి టెన్నిస్ తారలు కదనంలో రంగంలో ప్రత్యర్ధులను చిత్తు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో తొలిసారిగా నెంబర్ టు మహిళా టెన్నిస్ తార సెరీనా విలియమ్స్ ( అమెరికా) గర్బిణిగా ఉండటం వలన, షెడ్యూల్ మార్పు వలన స్విస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెడరర్ టోర్నీ నుంచి వైదొలిగారు.దీంతో టైటిల్ వేటలో నెంబర్ వన్ తారలు, అనుహ్యంగా ఇటీవల అగ్రశేణి స్టార్‌కు షాకిస్తున్న యువ స్టార్‌లు కూడా ఎవరి షాకిస్తారో అన్న అసక్తి నెలకొంది. జర్మన్ యువ ఆటగాడు అల్జెగాండర్ జ్వెరెవా ఇటీవల రోమ్ మాస్టర్స్‌లో జకోవిచ్‌ను ఓడించి తొలి మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాను కూడా టోర్నీ రేసులో ముందంజ వేస్తానన్న హెచ్చరికలు చేశాడు కూడా. ఈ నేపథ్యంలో రెండో సారి టైటిల్ వేటకు మాజీ నెంబర్ వన్, ఢిపెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ ఈ సారి తీవ్రంగా కష్టపడాల్సిందేనట్లు తెలుస్తోంది. గత రన్నరప్ నెంబర్ వన్ ఆండీ ముర్రేను ఊరిస్తున్న ఫ్రెంచ్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ఆశపడుతున్నాడు. క్లే కోర్టు హీరో రఫెల్ నాదల్ సైతం పదో సారి టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకోవాలని ఉవ్విళూరుతున్నాడు. గతేడాది ఢిపెండింగ్ ఛాంపియన్ గార్మైన్ ముగురుజ రెండో టైటిల్ వేటకు సిద్దం కాగా, సెరీనా విలియమ్స్ లేని లోటును ఆమె చెల్ల్లెలు వీనస్ విలియమ్స్ ఆటలో రాణించి ముందడగు వేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండడా సిమోనా హాలెప్ కూడా టైటిల్ రేసులో నేనున్నాంటూ ప్రత్యర్థులు హెచ్చరికలు జారీ చేస్తోంది. రెండు వారాల పాటు సాగే ఫ్రెంచ్ సమరంలో ఎవరు టైటిళ్లుతో మెరుస్తారో అన్న ఆసక్తి నెలకొంది.మహిళల డబుల్స్‌లో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కొత్త పార్టనర్ కజికిస్తాన్ ప్లేయర్ యరస్లోవా స్విదోవాతో నాలుగో సీడ్‌గా బరిలో దిగుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







