మారిషస్‌కు3,250 కోట్లు భారత్ సహాయం
- May 27, 2017
భారత్, మారిషస్‌ల మధ్య బంధం మరింత బలపడనుంది. నౌకాయాన భద్రత సహా పలు అంశాల్లో కలిసి ముందుకెళ్లాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో మారిషస్‌కు రూ.3,250 కోట్ల రుణసాయాన్ని భారత్ ప్రకటించింది. ‘నౌకాయాన భద్రత’ సహా నాలుగు అంశాల్లో కుదిరిన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. శనివారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్‌లు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. భూజలాధ్యయనం, పెట్టుబడులు, వాణిజ్యం తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రత్యేక సహాయ కార్యక్రమం కింద మారిషస్‌కు భారత్ గతంలో అందించిన తీరప్రాంత రక్షణ నౌక ‘గార్డియన్’ జీవన గడువును పెంచేందుకూ అంగీకారం కుదిరింది. అయితే, నౌకాయాన భద్రతతో పాటు... మారిషస్‌లో సివిల్ సర్వీసెస్ కళాశాల ఏర్పాటు; సముద్రాధ్యయనంలో సహకారం; మారిషస్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు భారత ఎగుమతులు-దిగుమతుల బ్యాంకు ఆర్థిక సాయానికి రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. సమావేశానంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ...‘‘ద్వైపాక్షిక నౌకాయాన భద్రత ఒప్పందం రెండు దేశాల సామర్థ్యాలను, సహకారాన్ని పెంపొందించనుంది.
సముద్ర చౌర్యం; మనుషులు, మత్తుపదార్థాల అక్రమ రవాణాకు దీనితో అడ్డుకట్ట పడనుంది. వాణిజ్యం, పర్యాటకాభివృద్ధికీ, సముద్ర వనరుల పరిరక్షణకు దోహదపడుతుంది. మారిషస్ అభివృద్ధి పట్ల భారత్ చిత్తశుద్ధితో ఉంది. భారీ రుణసాయమే ఇందుకు నిదర్శనం.
ఆ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం భారత్‌కు గర్వకారణం’’ అన్నారు. నైపుణ్యాభివృద్ధిలో సహకారం ఇచ్చి పుచ్చుకునేందుకూ తాము చర్చించామని మోదీ తెలిపారు. ఆ తర్వాత ప్రవీణ్ జగన్నాథ్ మాట్లాడుతూ- ‘‘రెండు దేశాలు తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం పట్లా.. సముద్ర మార్గాల భద్రతను కట్టుదిట్టం చేయడంపైనా దృష్టి సారించాలి.
ప్రాదేశిక జలాల్లో అక్రమ చేపల వేట, సముద్ర చౌర్యాన్ని నిరోధించాల్సి ఉంద’’న్నారు. 2015లో మోదీ మారిషస్ పర్యటన సందర్భంగా.. భారత్ తన నిధులతో తయారుచేసిన గస్తీనౌక (ఓపీవీ) బరకుడాను అక్కడ ప్రారంభించారు. ఆ విషయాన్ని ప్రస్తావించిన జగన్నాథ్...
ఓపీవీ రాకతో తమ భద్రతా సామర్థ్యం ఇతోధికంగా పెరిగిందంటూ భారత సాయాన్ని కొనియాడారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యతం పొందేందుకు తమ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







